కరోనా వాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16న జరుగనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. ముందుగా నిర్దేశించినట్లుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి, కొవిడ్ వారియర్లకు వ్యాక్సిన్‌లు ఇవ్వాలని ఆదేశించారు. 16న 332 సెషన్ సైట్లలో వ్యాక్సిన్ వేసేలా ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం - జిల్లాల ఉన్నతాధికారులతో సీఎస్ ఆదిత్యనాథ్ సమావేశం
కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల ఉన్నతాధికారులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 16న జరుగనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించారు.
కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
ఇప్పటికే రాష్ట్రానికి 4లక్షల 96 వేల డోసులు చేరాయని సీఎస్ వెల్లడించారు. 16న జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో గర్భిణులు, 50ఏళ్ల నిండిన వారికి, 18 ఏళ్ల లోపు వారికి, కోమార్భీడిటీ లక్షణాలతో ఇబ్బందిపడేవారికి వ్యాక్సిన్ వేయవద్దని స్పష్టం చేశారు.
ఇదీచదవండి:రాష్ట్రానికి చేరుకున్న 4.75 లక్షల కొవిడ్-19 టీకా డోసులు