జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం చిన్నఎల్లాపురం శివారు హాము తండాలోకి మొసలి ప్రవేశించింది. మొసలిని చూసిన తండా వాసులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మొసలిని బంధించారు. అనంతరం పాకాల సరస్సులో వదిలిపెట్టారు.
జనావాసాల్లో మొసలి సంచారం.... భయాందోళనలో స్థానికులు - mahaboobabad latest news
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో హాము తండాలో మొసలి హల్చల్ చేసింది. జనావాసాల్లోకి మొసలి రావటం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకుని బంధించి వాగులో వదిలేశారు.
జనావాసాల్లో మొసలి హల్చల్.. భయాందోళనలో స్థానికులు
గూడూరు సమీపంలోనీ పాకాల వాగులో మొసళ్లు తిరుగుతున్నాయని... అప్పుడప్పుడు కనపడుతున్నాయని స్థానికులు తెలిపారు. పాకాల వాగులో మొసళ్లు సంచరిస్తున్నాయని... రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని గుడూరు రేంజ్ అటవీశాఖ అధికారిణి అమృత వెల్లడించారు. రైతులు
వాగులోకి దిగవద్దని.. అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. మొసలి కనిపిస్తే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని అమృత సూచించారు.
ఇదీ చూడండి:రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్