ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో ఎక్కడ ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగినా విచారణ చేపట్టాలి'

రాజధాని భూముల విషయంలో ఇన్​సైడ్ ట్రేడింగ్​పై విచారణను స్వాగతిస్తున్నామని సీపీఎం నేత మధు తెలిపారు. అమరావతిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగినా.. విచారణ చేపట్టాలని సూచించారు.

cpm madhu on inside trading
cpm madhu on inside trading

By

Published : Sep 15, 2020, 5:52 PM IST

రాష్ట్రంలోని కరోనా రోగులకు కనీస వైద్య సదుపాయం అందడం లేదని.. ప్రభుత్వం వెంటనే అన్ని రాజకీయ పక్షాలను పిలిచి అభిప్రాయాలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. కొవిడ్ నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరైనదికాదని అన్నారు. వైద్యుడి పట్ల గుంటూరు కలెక్టర్ వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశారు.

రాజధాని భూముల విషయంలో ఇన్​సైడ్ ట్రేడింగ్​పై విచారణ జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అమరావతిలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగినా.. విచారించి దోషులను శిక్షించాలన్నారు.

ఇదీ చదవండి:విశాఖ గూఢచర్యం కేసులో ఇమ్రాన్​ గితేలీ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details