విద్యుత్ ఛార్జీల పెంపు నేపథ్యంలో సీపీఎం, వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో సీపీఎం నేత సీహెచ్ బాబూరావును పోలీసులు విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. వామపక్ష నేతలకు పోలీసులు నోటీసులు అందజేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచి... ప్రజలు నిరసన తెలిపేందుకు వస్తే అరెస్ట్ చేయడం, నోటీసులు జారీ చేయటం నిరంకుశత్వమని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని సీపీఎం నేతలు తెలియజేశారు.
గృహ నిర్బంధంలో సీపీఎం నేత బాబూరావు - vijayawada cpi latest news
విద్యుత్ ఛార్జీలు పెంపుపై సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను గృహ నిర్భంధం చేశారు. సీపీఎం నేత బాబూరావును విజయవాడలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అంతే కాకుండా నోటీసులు జారీ చేశారు.
సీపీఎం నేతలకు నోటీసులు జారీ చేేసిన పోలీసులు