పంతానికి పోయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రానికి అప్పగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల ఏర్పాటుకు జగన్ కృషి చేశారని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు... జల వివాదానికి కేంద్రమైన తెలంగాణ సీఎం కేసిఆర్‌ను జగన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. నదీ యాజమాన్య బోర్డులపై కేంద్రం గెజిట్‌పై లేనిపోని వివాదాలు సృష్టించి.. అధికారాలను కేంద్రానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు సహకరించుకుంటూ, రైతులు, ప్రజల విషయంలో కొర్రీలు పెడుతున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళనకు సీపీఐ మద్దతు...
తెదేపా, కాంగ్రెస్, వామపక్ష అనుబంధ విద్యార్ధి, యువజన సంఘాల ప్రతినిధులతో సీపీఐ రామకృష్ణ విజయవాడలో సమావేశమయ్యారు. జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ విధానాల కు వ్యతిరేకంగా చేపట్టే కార్యాచరణపై చర్చించారు. జులై 19న విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టే ఆందోళనకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్... జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేస్తే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసంతో ఆందోళన చేసిన నిరుద్యోగులను అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు.
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి...