కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూ.. వైద్యులు సేవలందించడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్యులను ప్రశంసించారు. అనంతరం లెనిన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలు పరస్పర దూషణలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోరితే.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడడం తగదన్నారు. కన్నాపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసి మరీ చెప్తానని విజయసాయిరెడ్డి అనడంపై రామకృష్ణ స్పందించారు. కరోనా నేపథ్యంలో ఆలయం మూసివేస్తే ఎక్కడ ప్రమాణం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, తదితరులు పాల్గొన్నారు.
'ఆలయం మూసేశారు... మీరిద్దరూ ఎక్కడ ప్రమాణం చేస్తారు?' - విజయవాడ లెనిన్ జయంత్యుత్సవంలో సీపీఐ రామకృష్ణ
ఒకవైపు ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరస్పర దూషణలు చేసుకోవడం ఏమిటని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్యులను అభినందించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ