ఎన్ఆర్సీ, సీఏఏకి మద్దతు ఇచ్చిన వైకాపా... వామపక్షపార్టీలపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి... వామపక్ష పార్టీలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. 25 ఎంపీలు ఇస్తే విభజన హామీలు, హోదా సాధిస్తామని చెప్పి.. 9 నెలల పాలనలో కేంద్రంతో కుమ్మక్కై ఒక్కటైనా సాధించారా అని ప్రశ్నించారు. 68 రోజులుగా రైతులు నిరసనలు చేస్తుంటే సాక్ష్యాత్తు ఎంపీనే వారిపై దాడులు చేయించి... అర్ధరాత్రి వరకు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకు ఈడుస్తుంటే జగన్మోహన్రెడ్డి కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల అంశంపై ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.
'చిల్లర రాజకీయాలు మానండి... విభజన హామీలపై దృష్టి పెట్టండి'
ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా పోరాడుతోన్న తమపై వైకాపా నేతలు అనవసర ఆరోపణలు మానుకోవాలని సీపీఐ రామకృష్ణ హితవు పలికారు. వామపక్షాలపై వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.
'చిల్లర రాజకీయాలు మానండి...విభజన హామీలపై దృష్టి పెట్టండి'