'వైకాపా ఏడాది పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - 'వైకాపా ఏడాది పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
వైకాపా ఏడాది పాలనలో రంగాలవారీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
'వైకాపా ఏడాది పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
వైకాపా ఏడాది పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధిపై సమాధానం చెప్పాలన్నారు. 65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగడమే అభివృద్ధా? అని రామకృష్ణ ప్రశ్నించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.