ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఐదేళ్లు పడుతుందని ఆర్థికమంత్రి చెప్పడం విడ్డూరమని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణవిజయవాడలోఎద్దేవా చేశారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రాజెక్టు టెండర్లు ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదనీ.. ఏకపక్షంగా టెండర్లు రద్దు చేసేశారన్నారు. అమరావతి విషయంలోనూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారనీ.. రాజధాని విషయంలో మంత్రే దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. దొనకొండలో రాజధాని పెడితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇసుక కొరతతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి తక్కువ... రద్దులు ఎక్కువ: సీపీఐ
"పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదు. అమరావతి విషయంలోనూ గందరగోళంగా మాట్లాడుతున్నారు. పాత ఇసుక విధానాన్ని అనాలోచితంగా రద్దు చేశారు. లక్షల కుటుంబాలను రోడ్డున పడేశారు. రాష్ట్రప్రభుత్వానికి ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు." -- సీపీఐ రామకృష్ణ
'పోలవరం'పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: సీపీఐ రామకృష్ణ