ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Narayana: 'వైకాపా ప్రభుత్వాన్ని కూలదోస్తే ఊరుకోం'

కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వైకాపా ప్రభుత్వాన్ని కూలదోస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుని.. తమకు తామే ప్రభుత్వాన్ని కూలదోసుకునేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందన్నారు.

CPI leader Narayana
సీపీఐ నేత నారాయణ

By

Published : Aug 8, 2021, 2:54 PM IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ.. వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేంద్రం అలాంటి ప్రయత్నాలు చేస్తే అది అప్రజాస్వామికమనీ.. తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. వామపక్షాలుగా తాము కేంద్రం చర్యలపై స్పందిస్తామని చెప్పారు.

అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వం 134 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. పరిధికి మించి రుణాలు తీసుకుంటోందని.. తమకు తామే ప్రభుత్వాన్ని పడగొట్టుకునేలా వ్యవహరిస్తోందని నారాయణ అన్నారు. అమర్ రాజా సంస్థ సూట్ కేస్ కంపెనీ కాదని.. అలాంటి సంస్థ ఏర్పాటు చేసిన అనుభవం ఉందా.. అని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ అన్నది.. ఒకే పార్టీకి చెందిన వారితో కేంద్రం ఆడిస్తున్న ఆట అని చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details