తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నారు. మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రాజు టీకా తీసుకున్నారు.
టీకా కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్‌లో 42 ఉండగా.. 10 కంటే ఎక్కువగా టీకా పంపిణీ కేంద్రాలున్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (13), భద్రాద్రి కొత్తగూడెం (14), ఖమ్మం (15), మహబూబ్‌నగర్ (11), మేడ్చల్ మల్కాజిగిరి (11), నల్గొండ (18), నిజామాబాద్ (14), రంగారెడ్డి (14), సంగారెడ్డి (12), సిద్దిపేట (12), సూర్యాపేట (10), వరంగల్ నగర (14) జిల్లాలున్నాయి.