ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూరలు అమ్మిన చోటే.. కూరగాయలు - విజయవాడలో కరోనా కేసులు

కరోనా దెబ్బకు కొందరి జీవితాలు తలకిందులయ్యాయి. సాఫీగా సాగుతున్న వ్యాపారాలు కుదేలయ్యాయి. బతకడానికి కొత్త వ్యాపారాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కర్రీపాయింట్ పెట్టుకుని మంచిగా జీవనం సాగించే వారు.. ఇప్పుడు కూరగాయులు అమ్ముకుని కడుపు నింపుకుంటున్నారు.

corona-effect-in-vijayawada
corona-effect-in-vijayawada

By

Published : Jun 27, 2020, 10:21 PM IST

విజయవాడ గణదల ప్రాంతంలో కర్రీపాయింట్… ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు, హాస్టల్స్ లో ఉండే యువత ఎక్కువగా ఈ కర్రీ పాయింట్ కు రావడంతో ఒకప్పుడు దీనికి మంచి డిమాండ్ ఉండేది. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ తో దుకాణాలు మూతపడ్డాయి. వైరస్ కు భయపడి వండిన కూరలు కొనే వారు లేరు. గత మూడు నెలలుగా కర్రీపాయింట్ తెరవలేదు. కంటోన్​మెంట్ జోన్ తో దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. కుటుంబ పోషణ భారమైంది. దీంతో వేరే మార్గం లేక కూరగాయులు అమ్ముకుంటున్నారు. నగరంలో ఇలానే చాలామంది బతకడానికి కొత్తమార్గాలు వెతుక్కుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details