ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న పరీక్షలు.. తొలగని భయాందోళనలు - corona cases in krishna district news

కృష్ణా జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు జిల్లాలో 339 మంది కరోనా బారిన పడ్డారు. 137 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారు. జిల్లాలో మొతం 17 వేల 569 పరీక్షలు నిర్వహించగా.. 2675 ఫలితాలు రావాల్సి ఉంది.

corona cases in krishna district
corona cases in krishna district

By

Published : May 11, 2020, 3:32 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 339కి చేరింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఒకే ఒక్క కొత్త కేసు నమోదైంది. గత 24 గంటల్లో 447 మందికి సంబంధించిన నిర్ధరణ పరీక్షల నివేదికలు రాగా వాటిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. గత పది రోజుల్లో ఇంత తక్కువ కేసులు నమోదైన రోజు ఇదే. జిల్లాలో కరోనా అనుమానితులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన వారిలో 2675 మందికి సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. దీనికి తోడు నిత్యం అనుమానిత ప్రాంతాల్లో నిర్ధరణ పరీక్షలను వైద్యులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వచ్చిన 339 పాజిటివ్‌ కేసుల్లో 137 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో ముగ్గురు శనివారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ కరోనాతో 13 మంది చనిపోయారు. మిగిలిన 189 మంది ప్రస్తుతం జిల్లాలోని విజయవాడ, చినఅవుటుపల్లిలో ఏర్పాటు చేసిన రెండు కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

సామాజిక దూరం లేకపోవడమే...

పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో అత్యధికంగా విజయవాడ నగరంలోని రెండు మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయి. స్థానికుల్లో నిర్లక్ష్యం కారణంగా.. మరింత ఉద్ధృతమయ్యాయి. ఫలితంగా.. కార్మికనగర్‌, మాచవరంలో ఎవరూ బయటకు రాకుండా చేసేందుకు.. నిత్యవసర సరకులతో సహా ఏం అవసరమైనా డోర్‌ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత రెండ్రోజులుగా పరిస్థితి కొంతవరకు అదుపులోకి వస్తోంది. ప్రత్యేకంగా కూరగాయలు, పాలు, నీళ్ల కోసం కూడా మొబైల్‌ వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటికి అందిస్తుండడం సత్ఫలితాలు ఇస్తున్నాయి.

జిల్లాలో పరిస్థితి ఇదీ..

  • మొత్తం నిర్ధారణ పరీక్షలు : 17,569
  • నెగెటివ్‌ వచ్చిన వారు : 14,555
  • నివేదిక రావాల్సిన వారు : 2675
  • క్వారంటైన్‌ కేంద్రాలు : 34
  • క్వారంటైన్‌లో ఉన్న వారు : 251
  • వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌ టోల్‌ఫ్రీ నంబరు: 14410
  • టెలీమెడిసిన్‌ ద్వారా సహాయం పొందిన వారు: 57
  • జిల్లాలో ఇప్పట ¨వరకు సహాయం పొందిన వారు: 1314
  • పాజిటివ్‌ వచ్చిన వారు : 339
  • చనిపోయిన వారు : 13
  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన వారు : 137
  • ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు : 189
  • వలస కార్మికుల శిబిరాలు : 23
  • శిబిరాలలో ఉంటున్న కార్మికులు : 1134
  • ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు : 3254
  • స్వచ్ఛంద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న వారు : 11

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details