ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా సంక్షేమ పథకాలకు అగ్రకులంలోని పేదలు అర్హులు కాదా?'

అగ్రకులాల్లో పేదలు వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులా కాదా? ఇదెక్కడి ధర్మం.. అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలకు వైకాపా అడుగడునా.. అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

'వైకాపా సంక్షేమ పథకాలకు అగ్రకులంలోని పేదలు అర్హులు కాదా?'
'వైకాపా సంక్షేమ పథకాలకు అగ్రకులంలోని పేదలు అర్హులు కాదా?'

By

Published : Aug 12, 2020, 10:44 PM IST

45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలను ఆదుకునేందుకు వైయస్సార్ చేయూత పథకాన్ని తీసుకువచ్చారని.. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకే పథకాన్ని పరిమితం చేయడం ఎంత వరకు సమంజసమని తులసిరెడ్డి ప్రశ్నించారు. అగ్ర వర్ణాల్లో కటిక దారిద్య్రం అనుభవిస్తున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.

వైఎస్సార్ పెళ్లి కానుక పథకం అగ్ర కులాల పేదలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 శాతం ఆర్థికంగా వెనకబడిన అగ్ర కులాల.. పేదలకు రిజర్వేషన్​ లేక నష్టపోతున్నారన్నారు. తక్షణమే అగ్ర కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రిజర్వేషన్ అమలు జీవో విడుదల చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details