పంట నష్టం బారెడు.. పెట్టుబడి సాయం బెత్తెడు. ప్రచార ఖర్చు మూరెడు.. ఇది నివర్ తుపాను కథా కమామిషు అంటూ.. కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పంట నష్టం ఎకరాకు రూ. 30 వేల నుంచి లక్ష వరకూ ఉంటుందని.. కానీ ప్రభుత్వం ఇస్తుంది కేవలం 5,379 రూపాయలే అన్నారు.
2019 ఖరీఫ్ ఫసల్ బీమా యోజనలో బీమా సొమ్ము స్వాహా చేశారని తులసిరెడ్డి ఆరోపించారు. వైకాపా పాలనలో అర్హులకు ఖేధం.. అనర్హులకు మోదంగా ఉందని ఆయన మండిపడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ఫ్లాంట్(ఆర్టీపీపీ) మూసివేత.. మరోపక్కా సౌర విద్యుత్ ప్లాంట్లుకు టెండర్లు పిలవడం కమీషన్ల కోసమేనని తులసిరెడ్డి విమర్శించారు.