ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దా'రుణ' యాప్​ల వలలో బెజవాడ వాసులు

ఆన్​లైన్ యాప్​ల వేధింపుల సెగ విజయవాడను తాకింది. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేక వేధింపులకు‌ గురవుతున్న వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 20 ఫిర్యాదులు వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

ONLINE LOAN APPS FRAUDS
ONLINE LOAN APPS FRAUDS

By

Published : Dec 21, 2020, 4:50 PM IST

విజయవాడలో ఆన్​లైన్​ రుణ సంస్థల బాధితుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేని వారిని యాప్ నిర్వాహకులు వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరహాలో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 20 ఫిర్యాదులు వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.

బాధితులు ఒక్కొక్కరు 50 వేల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. పెనమలూరు, భవానీపురం, కృష్ణలంక, సత్యనారాయణపురం, పటమట ప్రాంతాలకు చెందిన కొంతమంది బాధితులు ఈ వేధింపుల విషయమై ఫిర్యాదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 52 మైక్రో ఫైనాన్స్ యాప్​లను గుర్తించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details