విజయవాడ భవానీపురానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో విజయవాడ కొవిడ్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ 60 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నామన్న అధికారులు నిమ్రా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. నిమ్రాకు వెళ్లగా అక్కడ పైఅధికారుల నుంచి సమాచారం వస్తేనే తాము అనుమతినిస్తామని లోపలికి రానివ్వకుండా బయటే ఉంచేశారు. అక్కడే రోడ్డుపై ఉన్న వ్యక్తి.. 'ఈటీవి భారత్ - ఈనాడు'కి సమాచారం ఇవ్వగా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ గన్నవరం పిన్నమనేని కోవిడ్ సెంటర్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కలెక్టర్ స్పందన.. కరోనా రోగికి అందిన వైద్యం - విజయవాడలో కరోనా కేసులు
విజయవాడలో చికిత్స అందక ఇబ్బంది పడుతున్న కరోనా రోగికి 'ఈటీవీ భారత్' సాయంతో వైద్యం అందింది. అతని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. పిన్నమనేని కోవిడ్ సెంటర్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
collector respond on etv story