పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 4.57 లక్షల క్యూసెక్కులు కాగా.. 4.44 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కాలువలకు 12,789 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజికి భారీగా వరద.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక - ప్రకాశం బ్యారెజీ వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పులిచింతల నుంచి ఇన్ ఫ్లో 4,56,989 క్యూసెక్కులు వస్తుండగా.. 5,11,073 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు.
prakasham flood water
వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పరివాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నివాస్ సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
ఇదీ చదవండి:ప్రకాశం బ్యారేజికి భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు
Last Updated : Aug 6, 2021, 8:12 PM IST