CM JAGAN PARIS TOUR: ముఖ్యమంత్రి జగన్.. భార్య భారతీతో కలిసి పారిస్ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. రాత్రి 8 గంటలకు అక్కడి నుంచి విమానంలో పారిస్‌కు బయలుదేరుతారు. సీఎం దంపతులు.. ఈనెల 29న పారిస్‌కు చేరుకుంటారు. జూలై 2న జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి చదువుతున్న యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జూలై 3న తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. హర్షా రెడ్డి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న విషయం తెలిసిందే.
సతీసమేతంగా పారిస్ వెళ్లనున్న సీఎం జగన్ - CM YS Jagan To Visit Paris
CM YS Jagan To Visit Paris: ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా ఈరోజు పారిస్ పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి పారిస్‌కు వెళ్తారు. జూలై 3న తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
CM YS Jagan To Visit Paris
Last Updated : Jun 28, 2022, 6:16 AM IST