ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Review on rains: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష..కలెక్టర్లకు కీలక ఆదేశాలు - కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మరోమారు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల విషయంలో రాజీ వద్దని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్
భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్

By

Published : Nov 18, 2021, 9:20 PM IST

భారీ వర్షాలపై సీఎం జగన్‌ అధికారులతో(cm ys jagan review meeting with collectors over heavy rains) మరోమారు సమీక్షించారు. నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లతో మాట్లాడారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతిలో పరిస్థితిపై చిత్తూరు కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. అవసరమైనచోట సహాయ శిబిరాలు తెరవాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో అన్ని వసతులు ఉండేలా చూసుకుంటూ..బాధితులకు తక్షిణ సహాయం కింద రూ. 1000 అందించాలన్నారు. తిరుపతిలో సహాయక చర్యలపై కార్యాచరణ సిద్ధం చేసి..అందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

వర్షాల కారణంగా వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధుల కొరత లేదని.. సహాయక చర్యల విషయంలో రాజీపడవలసిన అవసరం లేదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. శాఖాధిపతులు పరిస్థితుల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. ఏం కావాలన్నా వెంటనే కోరాలని తెలిపారు. నిరంతరం తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సహాయ చర్యలు చేపట్టాలని సమీక్షలో పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం..వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మరో మారు కలెక్టర్లతో మాట్లాడారు. ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details