ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 22, 2020, 5:03 PM IST

Updated : Jun 22, 2020, 6:41 PM IST

ETV Bharat / city

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను సీఎం జగన్ కలిశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు.

cm jgan meet governor bishwa bhushan
cm jgan meet governor bishwa bhushan

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మరికొందరు నేతలు ఉన్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. బడ్జెట్‌ సమావేశాల ముగిసిన తర్వాత గవర్నర్‌తో సీఎం భేటీ అవుతుండడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, వ్యాధి నిర్ధరణ పరీక్షల వివరాలను సీఎం... ఈ భేటీలో గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. శాసనసభ, శాసన మండలిలో బడ్జెట్‌ సమావేశాల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీలు పిల్లి సుబాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం.. వారు రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ

ఇదీ చదవండి: 'బీఎస్ 4' కేసు: జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి

Last Updated : Jun 22, 2020, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details