cm jagan tour : రేపు కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ - cm jagan kadapa tour news
20:14 September 30
మామ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతికి హాజరుకానున్న జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు కడప జిల్లాకు వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి 4 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళతారు. సాయంత్రం అక్కడే స్థానిక నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 10 గంటలకు పులివెందులలోని లయోల డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న డాక్టర్ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. గంగిరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా భాకరాపురం ఆడిటోరియంలో నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొంటారు. తర్వాత కడప విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి గన్నవరం బయలుదేరి వస్తారు. ముఖ్యమంత్రి జగన్ భార్య భారతి తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో గతేడాది మరణించారు.
ఇదీచదవండి.