CM YS Jagan Review on Health Deportment: ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన లబ్ధిదారుల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. చికిత్స అందించిన ఆసుపత్రులకు వాటి ద్వారానే బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు రోగి నుంచి ముందుగా అంగీకారాన్ని పొందాలన్నారు. ఈ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. రోగులకు వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, ఆందోళనలు అవసరం లేదని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి చేసే సమయంలోనే.. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంపై రోగికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో చేరిన వారి నుంచి అదనంగా వసూళ్లు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడున్న 2,436 చికిత్సలను ఇంకా పెంచాలని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే... ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందేలా ఉండాలని పేర్కొన్నారు. 108, 104 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా లంచాలకు ఆస్కారం ఉండకూడదని, ఇలాంటివాటిపై ఫిర్యాదు చేయాల్సి నంబర్లను వాహనాలపై ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.
వైద్యుల ‘వయసు’ పెంచుదామా!
పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు వైద్యుల కొరత ఉండకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు. అవసరమైతే వైద్యుల ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచడంపై ఆలోచించాలన్నారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 40,188కు గాను 1,132 మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. 176 పీహెచ్‌సీ భవన నిర్మాణాలు పూర్తయితే.. మరో 2,072 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు పాల్గొన్నారు.
ట్యాబ్‌లు మూడేళ్లపాటు పనిచేయాలి..