రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు జలవనురలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. జలవనురలశాఖపై సీఎం జగన్ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిని అక్కడ పనులు ఆగిపోయాయని అంబటి అన్నారు. డయాఫ్రం వాల్ పరిశీలనకు ఈ నెల 18న నిపుణులు రానున్నట్లు వెల్లడించారు. కాపర్‌డ్యాం మళ్లీ నిర్మించాలా లేదా అనేది చర్చిస్తామని చెప్పారు. నిపుణులు, కేంద్ర సంస్థల అభిప్రాయం మేరకు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు: మంత్రి అంబటి - అంబటి తాజా వార్తలు
పోలవరం కాపర్‌డ్యాం మళ్లీ నిర్మించాలా? లేదా అనేది నిపుణులు, కేంద్ర సంస్థల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు జలవనురలశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
మంత్రి అంబటి
"పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిని అక్కడ పనులు ఆగాయి. డయాఫ్రం వాల్ పరిశీలనకు ఈ నెల 18న నిపుణులు వస్తున్నారు. కాపర్‌డ్యాం మళ్లీ నిర్మించాలా లేదా అనేది చర్చిస్తాం. నిపుణులు, కేంద్ర సంస్థల అభిప్రాయం మేరకు ఏం చేయాలో నిర్ణయం." -అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి
ఇవీ చూడండి :