ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించిన సీఎం - సీఎం జగన్​ తాజా వార్తలు

JAGAN REVIEW ఆరోగ్యశ్రీలో గణనీయంగా చికిత్సలు పెంచాలని సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఆరోగ్యశ్రీలో కొత్తగా 754 ప్రొసీజర్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రొసీజర్ల సంఖ్య 3,118కు చేరింది. మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక నుంచి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు ఉంటారని స్పష్టం చేశారు.

JAGAN REVIEW
JAGAN REVIEW

By

Published : Aug 17, 2022, 4:22 PM IST

Updated : Aug 17, 2022, 8:09 PM IST

CM Jagan Review on Health Department: ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్లను మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లు అమల్లోకి తీసుకురావాలని అధికారులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానాలు అందుబాటులోకి రానుండగా.. ఈ పథకం కింద చికిత్స అందుతోన్న విధానాల సంఖ్య 3118కి చేరనుంది. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం పచ్చజెండా ఊపారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్​పై సీఎం సమీక్షించారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని.. అందుకోసం మూడు అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని.. అనంతరం పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన అంబులెన్స్‌లను సిద్ధం చేయాలని.. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించుకుని.. పనులు ఎలా ముందుకు సాగుతున్నాయనే దానిపై రోజూ సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పీహెచ్‌సీలు–మొబైల్ మెడికల్ యూనిట్లు (MMU)ల మ్యాపింగ్‌ పూర్తైందని.. పీహెచ్‌సీలు – సచివాలయాలు మ్యాపింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 656 ఎంఎంయూ104లు పని చేస్తున్నాయని.. మరో 432 వాహనాలను సమకూరుస్తున్నామని పేర్కొన్నారు.

వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌: వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో మూడు నుంచి నలుగురు సిబ్బంది ఉంటారన్న సీఎం.. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారని వివరించారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా ఉంటారని స్పష్టం చేశారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. 6956 టెలీమెడిసన్‌ స్పోక్స్, 27 హబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్‌ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పని చేయాలని, ఈ మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలని సూచించారు.

వైద్య కళాశాలల ఏర్పాటు-ప్రగతిపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం జిల్లాలోనూ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని.. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బూస్టర్‌ డోస్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్‌ డోసు వేయాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 17, 2022, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details