దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సీఎం జగన్ దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజు కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ - దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ వార్తలు
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం రోజున సర్వసతీదేవీ అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.
అంతకుముందు ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంతో పాటు మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు, జోగి రమేశ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి :విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు