ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని పింగళికి భారత రత్న ప్రకటించటం సముచితమని ముఖ్యమంత్రి లేఖలో పేర్కోన్నారు.
'పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలి' - సీఎం జగన్ వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించిన పింగళి వెంకయ్య సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం పేర్కొన్నారు.
'పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలి'
మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య స్వాంతంత్య్ర సమరయోధుడుగా కీలకమైన పాత్ర పోషించారని... ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం పేర్కొన్నారు. అరుణాఆసఫ్ అలీ, భూపేంద్రకుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లాంటి ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపైనా మువ్వన్నెల జెండా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎం వెల్లడించారు.
ఇదీ చదవండి
పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం
Last Updated : Mar 12, 2021, 6:11 PM IST