ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు కృష్ణా, ఎల్లుండి విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన - జగన్ విశాఖ టూర్

CM Jagan Tour రేపు కృష్ణా, ఎల్లుండి విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూలను సీఎంవో అధికారులు విడుదల చేశారు. రేపు కృష్ణా జిల్లా పెడనలో వైయస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననుండగా ఎల్లుండి విశాఖలో పర్యటించి సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌తో ఒప్పందం చేసుకోనున్నారు.

విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

By

Published : Aug 24, 2022, 5:34 PM IST

Updated : Aug 24, 2022, 9:28 PM IST

CM Jagan tour: ముఖ్యమంత్రి జగన్ రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో వైయస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరతారు. 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు పెడన బంటుమిల్లి రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్న సీఎం.. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైయస్సార్‌ నేతన్న నేస్తం నగదు పంపిణీతో పాటు గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధుల విడుదల ద్వారా 80,546 మంది నేతన్నల ఖాతాల్లోకి రూ.193.31 కోట్ల నిధులు జమ చేయనున్నారు. సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఆర్థికసాయం అందజేస్తారు.

ఎల్లుండి (ఈనెల 26) విశాఖపట్నం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్‌ ది ఓషన్స్‌తో ఒప్పందం చేసుకోనున్నారు. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్‌ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధృవపత్రాలను సీఎం అందించనున్నారు. ఎల్లుండి ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ మధ్య అవగాహనా ఒప్పందం చేసుకుంటారు. సీఎం ప్రసంగం అనంతరం అక్కడినుంచి బయల్దేరి సిరిపురం ఏయూ కన్వకేషన్‌ హాల్‌కు చేరుకుంటారు. 11.23 గంటలకు మైక్రోసాఫ్ట్‌ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందించి వారితో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 12.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 24, 2022, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details