ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ వ్యక్తిగత మినహాయింపు పిటిషన్​పై నేడు విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు న్యూస్

అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

cm jagan illegal assets case
cm jagan illegal assets case

By

Published : Jan 28, 2020, 5:40 AM IST

అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో 11 సీబీఐ చార్జ్ షీట్లపై విచారణకు తన బదులు న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని జగన్ అభ్యర్థించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ... హైకోర్టులో నిన్న జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా తానూ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details