ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"జపానీయులకు అనువాదం చెప్పాలి"

కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. గురుకుల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆసక్తికర అంశాలపై సీఎం మాట్లాడారు.

విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి

By

Published : Feb 17, 2019, 6:18 AM IST

విద్యార్థులతో సీఎం ముఖాముఖి
విద్యార్థుల ఆసక్తిని తెలుసుకోని ఆ రంగాల్లో వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు జపాను భాషను నేర్చుకుంటున్నట్లు తెలుసుకున్న సీఎం, జపాను నుంచి ఎవరైనా వస్తే గురుకుల విద్యార్థులే అనువాదం చేయాలని, అలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో ఆసక్తికరంగా సంభాషించిన చంద్రబాబు ప్రతి విద్యాలయంలో ఆంగ్ల మాధ్యమం, డిజిటల్, వర్చువల్ తరగతులు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా 95 శాతం ఉత్తీర్ణత సాధించామన్న సీఎం ఈ సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details