అనవసరమైన అపోహలతో ఒక్కసారిగా అందరూ ఆధార్ కేంద్రాలకు వెళ్తుండటంపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్పందించారు. రేషన్ కార్డుల ఈ-కేవైసీ కోసం ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా ఈ- కేవైసీ నమోదు చేయించుకోవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ఇకపై లబ్ధిదారులు ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
e-kyc: వాలంటీర్, రేషన్ డీలర్ల వద్దే ఈ-కేవైసీ నమోదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్
19:48 August 19
e-kyc made easy
రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు పొందడం కోసం బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని వెల్లడించారు. అయితే ఈ- కేవైసీ కోసం బియ్యం కార్డుదారులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతి వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ పరికరం ద్వారా, రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్న ఈ- పోస్ పరికరం ద్వారా నివాస ప్రాంతాల్లోనే సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని వెల్లడించారు.
ఇదీ చదవండి:
Orphan Students: వారి బాగోగుల గురించి నెలవారి నివేదిక తప్పనిసరి..!