'పలాస' సినిమాలోని పాటకు వచ్చినంత ఆదరణ తమ సైబర్ క్రైం అవగాహన కార్యక్రమాలకు రావాలని సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ అన్నారు. వినోదానికి అవసరమైన పాటను 6 కోట్ల మంది చూశారని.. కానీ విజ్ఞానానికి సంబంధించిన 'ఈ రక్షా' అవగాహన కార్యక్రమాన్ని ఇప్పటికి 4 లక్షల మందే చూశారన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 కోట్ల మంది చూసే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రక్షలో చెబుతున్న విషయాల వల్ల హాకర్ల బారిన పడకుండా మనం జాగ్రత్త పడొచ్చని తెలియజేశారు. దీనివల్ల మీ నగదుకు, వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందన్నారు.
'ఆ పాటకు వచ్చిన ఆదరణ ఈ రక్షా కార్యక్రమానికి రావాలి' - cid latest news
సైబర్ నేరాలపై ప్రారంభించిన 'ఈ రక్షా' అవగాహన కార్యక్రమాలను 4 లక్షల మంది వీక్షించారని సీఐడీ... ఏడీజీ సునీల్ కుమార్ అన్నారు. కానీ ఓ సినిమా పాటకు వచ్చినంత క్రేజ్ వీటికి రాలేదని.. వచ్చే వరకు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇటువంటి సామాజిక స్పృహ కార్యక్రమాల ద్వారా మీ నగదు, వ్యక్తిగత విషయాలు హాకర్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని ఆయన సూచించారు.
సీఐడి ఏడీజీ సునీల్ కుమార్