రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందడం లేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్(Chinta Mohan) ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వాటా 75 శాతం నిధులు ఇచ్చినా విద్యార్థులకు చెల్లించకుండా.. ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో 85 లక్షల మంది స్కాలర్షిప్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రశాంతంగా చదువుకునే అవకాశం కల్పించకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు సరిదిద్దుకుని, నవంబర్ 1వ తేదీ కల్లా ఉపకార వేతనాలను విడుదల చేయాలనిచింతా మోహన్ డిమాండ్ చేశారు.