'జగన్ కక్ష సాధింపులకు పోలీసులు దోషులవుతున్నారు' - 'జగన్ కక్ష సాధింపులకు పోలీసులు దోషులవుతున్నారు'
ప్రతిపక్షాలపై సీఎం జగన్ కక్షసాధింపులకు పోలీసులు దోషులుగా నిలడబాల్సి వస్తోందని మాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. వైద్యుడు సుధాకర్‌పై వైకాపా ప్రభుత్వం పోలీసుల చేత చేయించిన దౌర్జన్యానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టని ధ్వజమెత్తారు
వైద్యుడు సుధాకర్‌పై జగన్ ప్రభుత్వం పోలీసుల చేత చేయించిన దౌర్జన్యానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప ధ్వజమెత్తారు. అమానవీయంగా దౌర్జన్యం చేసిన విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించడం సంతోషదాయకమన్నారు. గతంలో విశాఖ పోలీసులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు మందలించినా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. వైకాపా ప్రభుత్వం చేసే కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థ చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.