ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Students Innovation : ట్రాఫిక్ పోలీసులు "చిల్" అయ్యేలా.. ఐడియా అదిరింది గురూ..!! - మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఆవిష్కరణలు

నిత్యం రోడ్లపైనే విధులు నిర్వర్తించడం వారి బాధ్యత.. ఉష్ణోగ్రతలు 40కి చేరినా.. మండే ఎండల్లో కూడా విధులు నిర్వర్తించాల్సిందే. వారే ట్రాఫిక్ పోలీసులు. ఎండాకాలం వారు పడే అవస్థల్ని చూసి చలించారు విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థులు(Engineering Students Innovation). ఓ కొత్త ఆవిష్కరణతో వారికి మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించే ఉపాయం కనిపెట్టాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే తక్కువ ఖర్చుతో "చిల్‌ బ్రిల్లా" తయారు చేశారు. పేరుకు తగ్గట్లే ఇది చల్లని గొడుగు..! ఎండతాపం నుంచి సేదతీర్చే చల్లని గది..! పోలీసులకు రక్షణ కవచంగా మారుతున్న ఈ గొడుగు గురించి తెలుసుకుందాం.

Students Innovation
చిల్ బ్రిల్లా -ట్రాఫిక్ పోలీసుల కోసం ఓ చల్లని గొడుగు

By

Published : Nov 24, 2021, 7:07 PM IST

రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది. ప్రధాన నగరాలతో పాటుగా సాధారణ పట్టణాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. కేవలం వేసవిలోనే కాదు ఇతర కాలాల్లోనూ ఎండతీవ్రత 40 డిగ్రీలకు మించి నమోదవుతోంది. అయితే.. పరిస్థితులు ఎలాంటివైనా ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వహించాల్సిందే. ఎండలకు, వానలకు తట్టుకుని విధులు నిర్వహించడం అంటే తలకు మించి భారమే అవుతున్నప్పటికీ తప్పటం లేదు. దీంతో అనారోగ్య సమస్యలకు వారు గురువుతున్నారు. వీరి బాధలను చూసి చలించిన విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు(Vijayawada PVP Sidhartha Engineering College Students) సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.

చిల్ బ్రిల్లా -ట్రాఫిక్ పోలీసుల కోసం ఓ చల్లని గొడుగు

చూడటానికి టెలిఫోన్‌ బూత్‌లా(Mechanical Engineering students innovated Chill Brilla) కనిపించే ఈ ఆవిష్కరణ పేరు.. చిల్‌బ్రిల్లా. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న సంతోష్‌, సునీల్‌, జయంత్‌, దినేష్‌ తయారు చేశారు. నిప్పులు కక్కుతున్న వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదిస్తూ విధులు నిర్వహించేలా విద్యార్థులు చిల్ బ్రిల్లాను రూపొందించారు.

ఈ చిల్‌బ్రిల్లా బూత్‌లో నీటితొట్టె, మోటారు, సోలార్‌ ప్యానెల్‌, బ్యాటరీ వంటివి అమర్చారు. ఎండకాలంలో సౌరశక్తిని (Chill Brilla works with solar power) ఉపయోగించుకుని ఈ బూత్‌ చల్లదనం ఇస్తుంది. వర్షకాలంలోనూ ఇదే హాయిని కలిగించేలా బ్యాటరీ సాయంతో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు లోపల కూర్చొని వాహనాలు గమనించేలా ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌ ఏర్పాటు చేశారు.

నగరాల్లో, పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కోసం ట్రాఫిక్‌ బూత్‌లు ఏర్పాటు చేసినా.. అందులో చల్లదనం లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము చేసిన ఈ నమూనాను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి ఉపయోగించుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

సరికొత్త ఆలోచనతో విద్యార్థులు ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టడానికి నగదు ప్రోత్సాహం కూడా అందించింది కళాశాల యాజమాన్యం. అలాగే ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హీటింగ్‌, రిఫ్రిజ్ రేటింగ్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇంజనీర్స్‌ కూడా డిజైన్‌ నచ్చి ఆర్థిక సహకారం అందించారు.

పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చిల్‌బ్రిల్లాను తీసుకెళ్లి త్వరలోనే విజయవాడ ట్రాఫిక్‌ పోలీసుల(Traffic Police) ఎండ కష్టాల్ని తీరుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు రూపకర్తలు.

ఇదీ చదవండి : RANK TO SMART POLICE: స్టార్మ్ పోలీసింగ్​లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్.. సీఎం జగన్ అభినందన

ABOUT THE AUTHOR

...view details