తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన కిలాడీ లేడీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నాగమణి కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చారు. రైల్వేలో టీటీఐ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుతో కలిసి సహజీవనం చేస్తోంది. సులువుగా నగదు సంపాదించేందుకు ఇద్దరూ కలిసి పథకం వేశారు. తన భర్త కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్నారంటూ తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని కొంతమందిని ఆమె నమ్మించింది. అలా 57 మంది నుంచి సుమారు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే రోజులు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవటంతో బాధితులు ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
CHEATING : తక్కువ ధరకే బంగారం పేరుతో మోసం... మహిళ అరెస్టు
విజయవాడలో కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు(arrest) చేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి, పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా సుమారు 8కోట్లు రూపాయలు వసూలు చేసినట్లు వెల్లడించారు.
తక్కువ ధరకే బంగారం పేరుతో మోసం