ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎవరికీ ఏమవరు.. అయినా అందరి బంధువులు! - serve needy

కొవిడ్‌-19.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. కోట్లాది మందికి ఉపాధిని దూరం చేసింది.. లక్షలాది మందికి పస్తులు మిగిల్చింది.. వేలాది మందిని ఆసుపత్రులపాలు చేసింది.. వందల కుటుంబాల్లో అయినోళ్లను దూరం చేసి కన్నీళ్లను మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ మహానగరంలోనూ అలాంటి కుటుంబాలెన్నో. ప్రాణవాయువు దక్కక పోయిన ప్రాణాలెన్నో. కాటికి చేరేందుకు కష్టాలు ఎదుర్కొన్న దేహాలెన్నో. ఆ కన్నీళ్లను తుడిచేందుకు ఈ చేతులు కదిలాయి. బాధలో ఉన్నవారికి మేమున్నామని భరోసానిచ్చాయి. ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు, క్షణాల్లో ప్లాస్మా దానాలు, అంబులెన్సు సర్వీసులు అందిస్తున్నాయి పలు సంస్థలు. ఈ విపత్కర పరిస్థితుల్లో గ్రేటర్‌ పరిధిలో విలువైన సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై ప్రత్యేక కథనమిది.

charitable-trusts-and-ngos-help-needy-during-corona-crisis
charitable-trusts-and-ngos-help-needy-during-corona-crisis

By

Published : Jul 27, 2020, 10:15 AM IST

కరోనా వైరస్‌ సోకి చనిపోతే పాడె మోసేవాళ్లు కాదు కదా చూసేవాళ్లూ కరవయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంలో ఓ యువ టెకీల బృందం అందుకు సిద్ధమైంది. అయినోళ్లు లేక అనాథల్లా శ్మశానానికి కదులుతున్న మృతదేహాలకు ఆఖరి మజిలీలో ఆత్మబంధువులవుతున్నారు. ‘లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌’ పేరిట సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మృతదేహాలకు ఉచితంగా అంత్యక్రియలు చేస్తోంది ‘సర్వ్‌ నీడీ’ స్వచ్ఛంద సంస్థ. సోమవారం నుంచి నగరంలోనూ సీపీ అంజనీకుమార్‌ చేతుల మీదుగా ప్రారంభమవుతోంది.

ఇలా మొదలైంది..

ఈ బృంద సభ్యుల స్నేహితుడి తల్లి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోగా మృతదేహాన్ని తరలించేందుకు, అంత్యక్రియలకు రూ.35 వేలు డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితి పేద కుటుంబాలకు రాకూడదని ‘సర్వ్‌నీడీ’ని ఏర్పాటు చేశారు. పేదలు, కుటుంబీకులు ముందుకురాని వారికి మాత్రమే ఈ సేవలందిస్తున్నామని సభ్యుడు కాట్రగడ్డ సాయితేజ తెలిపారు.

ఫోన్‌

84998 43545

ప్రాణవాయువు అందించి..

ఇర్షద్‌ అలీఖాన్‌, సాయిల్‌ఖాన్‌

నగరంలో కరోనా కష్టకాలంలో ఆక్సిజన్‌ అందక చనిపోతున్నవారే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరేందుకు స్థోమత లేక.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ప్రాణాలు వదులుతున్నారు పేదలు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నవారికి ఉచితంగా ప్రాణవాయువు అందించేందుకు ముందుకొచ్చారు చంచల్‌గూడ ప్రాంతానికి చెందిన సోదరులు సాయిల్‌ఖాన్‌, ఇర్షద్‌ అలీఖాన్‌.

కొందరికైనా సాయపడాలని..

ఇటీవల చంచల్‌గూడలో పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు కరోనాతో మృతిచెందారు. కొందరికైనా సాయపడాలన్న ఆలోచనతో ఇటీవల ఈ సేవలు ప్రారంభించాం. స్థానికంగా ఆక్సిజన్‌ అవసరమున్న వీలైనంత మందికి సేవలందిస్తున్నామని సాయిల్‌ఖాన్‌ వివరించారు.

ఫోన్‌

98855 53722, 88855 53722

అంత్యక్రియలు భారం కావొద్దని..

కొవిడ్‌ నేపథ్యంలో మృతదేహాల తరలింపు నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఎన్నో సమస్యలు. అంబులెన్సుల్లో తరలించేందుకు రూ.వేలల్లో ఖర్చవుతుండగా దహనానికీ అధికంగానే చెల్లించుకోవాల్సి వస్తోంది. పేదలకు ఇది మోయలేని భారమే. అందుకే ఉచితంగా అంతిమయాత్ర వాహనాల్ని అందిస్తోంది నగరానికి చెందిన అమూమత్‌ సొసైటీ.

వారం క్రితం ఆరంభించి..

గ్రేటర్‌లో మృతదేహాల్ని తరలించేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న బృంద సభ్యులు పేదలకు ఆ భారం తగ్గించేందుకు ఓ పాత వాహనాన్ని కొన్నారు. వారం క్రితమే సేవలు ప్రారంభించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేదే పేదలు. అక్కడ మృతదేహాల్ని తరలించేందుకు మా వాహనం అందిస్తున్నామన్నారు’ సొసైటీ ప్రతినిధి ఖలీదా పర్వీన్‌.

ఫోన్‌

76800 37677, 90308 19775

ఇదీ చూడండి

వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు అయినవాళ్ల ఆరా!

ABOUT THE AUTHOR

...view details