తెదేపా అధినేత చంద్రబాబు రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జిల్లా మహానాడు,నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్‌షో నిర్వహించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో జిల్లాల్లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు.
రేపటి నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటన
Babu Tour: మహానాడు జోష్‌ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను జిల్లా మహానాడుల ద్వారా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబు.. తన మలి పర్యటనను రేపటి నుంచి ఈ నెల 8వ వరకూ రాయలసీమలో చేపట్టనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జిల్లా మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్‌షో నిర్వహించనున్నారు.
తెదేపా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని ప్రాంతాల నుంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అక్కడ పార్టీని పటిష్టం చేయటంతో, క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశగా అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. రేపు మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా మహానాడు ద్వారా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, ఎల్లుండి పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఈనెల 8న చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్ షో జరగనుంది.
ఇవీ చూడండి