రోజుకో బీసీ సామాజికవర్గ ప్రయోజనాలు దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం అడ్డగోలు జీవోలు జారీ చేస్తోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మత్స్యకారుల మెడకు ఉచ్చు బిగించేందుకు తెచ్చిన జీవో నెంబరు 217 రద్దుకు తెదేపా పోరాడుతుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ మత్స్యకార సొసైటీల ప్రతినిధులు శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించారు. 217 జీవో వల్ల చేపల చెరువులపై ఆధారపడి జీవించే లక్షల మంది రోడ్డున పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఇసుక, మద్యం, విద్యుత్ ఛార్జీల పెంపుతో పేదల బతుకు దుర్భరం చేసిన జగన్ సర్కారు మత్స్యకారులనూ వేధిస్తోంది. చేపల చెరువులను వైకాపా నేతల హస్తగతం చేసేందుకే బహిరంగ వేలం విధానాన్ని తీసుకొచ్చారు. జీవో రద్దు కోసం మత్స్యకారులు అవసరమైతే న్యాయపోరాటం చేయాలి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే, తెదేపా అధికారంలోకి రాగానే సదరు జీవోను రద్దు చేస్తాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మత్స్యకార సెల్ ఏర్పాటు చేసి, బీసీ ఫెడరేషన్ ద్వారా సమస్యల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
136 రకాల కులవృత్తుల వారు రోడ్డున పడ్డారు..