ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: ప్రజా క్షేత్రంలో చురుగ్గా లేని.. పనిచేయని నాయకుల వివరాలు ఇవ్వాలి: చంద్రబాబు

Babu Review with party leaders: రోడ్డెక్కని నేతలు, పని చేయని నాయకుల విషయంలో నివేదికలివ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. శ్రీకాకుళం-విజయనగరం, విశాఖ-అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కోఆర్డినేటర్లతో సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు.. నెల రోజుల్లో నేతల పని తీరులో సమూల మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీలో గ్రూపులు కనిపించకూడదని హెచ్చరించారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jun 7, 2022, 9:12 PM IST

Updated : Jun 8, 2022, 8:42 AM IST

Babu Review with party leaders: ప్రజా క్షేత్రంలో చురుగ్గా లేని , పని చేయని నాయకుల వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లా నాయకులను ఆదేశించారు. మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ల కో-ఆర్డినేటర్లు చినరాజప్ప, గణబాబు, బుద్దా వెంకన్నలతో విడి విడిగా సమీక్షించారు.

నేతల పని తీరులో నెల రోజుల్లో సమూల మార్పు రావాల్సిందేనని...పార్టీలో గ్రూపులు కనిపించకూడదని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు సూచించారు. నియోజకవర్గ స్థాయిలో వివిధ విభాగాల్లో ఉన్న పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలన్న చంద్రబాబు ..ప్రజా సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో పోరాటాలు మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. 15రోజుల పాటు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని సూచించారు. తన ఆదేశాలను కింది స్థాయి నేతలకు చేరవేయాలని దిశనిర్దేశం చేశారు..

ఇవీ చదవండి:

Last Updated : Jun 8, 2022, 8:42 AM IST

ABOUT THE AUTHOR

...view details