ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vivekananda Jayanthi: వివేకానంద సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలి: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

వివేకానంద జయంతిని పురస్కరించుకుని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించారు. యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలన్నారు.

chandrababu on vivekananda jayanthi
chandrababu on vivekananda jayanthi

By

Published : Jan 12, 2022, 10:22 AM IST

వివేకానంద జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతికి వివేకానంద చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. యువతకు వివేకానందుడు ఆదర్శంగా నిలిచారని.. సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలన్నారు.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని వివేకానంద స్వామి అన్నారు. రాష్ట్రంలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయునికి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details