ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు అకాడ‌మీని 'తెలుగుదేశం అకాడ‌మీ' అనుకున్నారేమో: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు

తెలుగు భాష అభివృద్ధికి దోహ‌దం చేస్తోన్న తెలుగు అకాడ‌మీని `తెలుగుదేశం అకాడ‌మీ` అనుకున్నారేమో అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్యార్థుల‌కు ఓ పక్క తెలుగు మీడియం విద్యను దూరం చేస్తూ.. మ‌రో ప‌క్క తెలుగు అకాడ‌మీని నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

chandrababu nadiu comments on telugu academy
తెలుగు అకాడ‌మీపై అధినేత చంద్రబాబు కామెంట్స్

By

Published : Jul 11, 2021, 10:53 PM IST

తెలుగు అకాడ‌మీని `తెలుగుదేశం అకాడ‌మీ` అనుకున్నారేమో

తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. 1968 నుంచి ​తెలుగు భాష అభివృద్ధికి దోహ‌దం చేస్తోన్న తెలుగు అకాడ‌మీని 'తెలుగుదేశం అకాడ‌మీ' అనుకున్నారేమో అని ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఒక ప‌క్క కేజీ నుంచి పీజీ వ‌ర‌కూ విద్యార్థుల‌కు తెలుగు మీడియం విద్యను దూరం చేస్తూ.. మ‌రో ప‌క్క తెలుగు అకాడ‌మీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాష వికాసంపైనా సీఎం జగన్‌ రివ‌ర్స్ క‌న్ను ప‌డింద‌ని ఒక తెలుగువాడిగా బాధ‌ప‌డుతున్నానట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్‌ సైన్సు, వృత్తి విద్య (ఇంజినీరింగ్‌/ వైద్య) సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానమున్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై.. చంద్రబాబు ఆగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details