శాసనసభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. తనను తిట్టేందుకే అధికార పార్టీ సభ్యులు ఆసక్తి చూపిస్తున్నారని... అలాంటి వారికే మైక్ దొరుకుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణ బయట నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాసనసభకు తెదేపా ర్యాలీగా వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. తెదేపా శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని... ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని చంద్రబాబు అన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని... ఇది ఆరంభం మాత్రమే అని చంద్రబాబు హెచ్చరించారు.
ఇది ఆరంభమే... పోరాటాలు ఆగవు: చంద్రబాబు - fires
అసెంబ్లీ ఆవరణ బయట నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాసనసభకు తెదేపా ర్యాలీగా వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు.
సభకు ర్యాలీ గా వెళ్లిన తెదేపా