ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐఎఫ్​ఎస్ అధికారిని తొలగిస్తూ కేంద్రం ఆదేశాలు

రాష్ట్ర క్యాడర్​కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు చెందిన కల్లోల్ బిశ్వాస్​ను సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఉత్తర్వులు అందాయి.

central_govt_removed_ifs_officer_from_his_service

By

Published : Aug 1, 2019, 4:23 AM IST


ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు చెందిన కల్లోల్ బిశ్వాస్​ను సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్​కు చెందిన కల్లోల్ బిశ్వాస్ ప్రస్తుతం విద్యాశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన తొలగింపును నోటిఫై చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అఖిలభారత స్థాయి అధికారుల సర్వీసును మదింపు చేసేందుకు 360 డిగ్రీస్ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్రం.. సదరు మదింపులో వచ్చిన అంశాలు.. ఇతర ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ ఆయనను సర్వీసు నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయనను సర్వీసు నుంచి తొలగించే ముందు 3 నెలల కాలానికి జీతం ఇవ్వాల్సిందిగానూ కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది.

For All Latest Updates

TAGGED:

ifsoffcers

ABOUT THE AUTHOR

...view details