తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు జనం భారీగా తరలివచ్చారు. దీక్షలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఇసుక కొరత సహజంగా వచ్చింది కాదని... కృత్రిమంగా సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ''ఇవాళ ఇసుక కావాలంటే ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కావాలి. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మిస్తున్నారు. ప్రతి అంశంలోనూ జె-టాక్స్ వసూలు చేస్తున్నారు''... అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ లాంటి కుటిల నేతలను చాలామందిని చూశానని చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారు. పేదల బతుకులు మీకు తమాషాగా కనిపిస్తున్నాయా..? అని ప్రశ్నించారు. కార్మికులు కాలంతీరి చనిపోయారని... మంత్రి మాట్లాడటం దారుణమని ఆక్షేపించారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ నెల వ్యవధిలో సిమెంట్ రేటు పెరగలేదన్న ప్రతిపక్ష నేత... ఇవాళ 19 సంఘాలు వచ్చి తమ బాధలు చెప్పుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ఇంట్లో వాళ్ల ప్రాణాలు పోతే ఇలానే అంటారా:చంద్రబాబు ఒక్కరు వెళ్తే... 100 మందిని తయారుచేసుకుంటా...
పార్టీ నుంచి ఒక్క నాయకుడు వెళ్తే... వందమందిని తయారుచేసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇద్దరు నేతలను తీసుకొని తనపై విమర్శలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కుయుక్తులు తనవద్ద సాగవని జగన్ గ్రహించాలన్న చంద్రబాబు... తనకు అధికారంపై ఆశ లేదని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా... పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని గుర్తుచేశారు. గతంలో కేంద్రంలోనూ చక్రం తిప్పానని ఉద్ఘాటించారు.
మా వాళ్లనే తీసుకుని నాపై ప్రేరపిస్తారా:చంద్రబాబు ముఖ్యమంత్రికి డబ్బు పిచ్చి పట్టింది..
ముఖ్యమంత్రి జగన్‌కు డబ్బు పిచ్చి పట్టిందని తెదేపా అధినేత విమర్శించారు. ప్రజల ఆస్తులను బలవంతంగా రాసుకున్నా... ఆశ్చర్యం లేదని దుయ్యబట్టారు. ఇసుక పాలసీ కావాలనే తెచ్చి... పేదలను బలితీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏమైపోతోందో అనే బాధ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్నకాంటీన్లు ఏం చేశాయని నిలదీశారు. క్యాంటీన్లకు రంగులు మార్చి మరీ మూసివేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.
పవన్ నాయుడు అంటూ కులం అంటగట్టడమేంటి?
కులం పేరుతో సమాజాన్ని విడదీయాలని... జగన్ కుట్రపన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను... పవన్ నాయుడు అంటూ కులం అంటగట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తన నరనరాల్లో సామాజిక న్యాయం ఉందన్నారు. తనపై కుల ముద్ర వేయడాన్ని తప్పుబట్టారు.
గంగా నదిలో మునిగి... ఓట్లు వేయించుకుంటే సరిపోతుందా?
భవన నిర్మాణ కార్మికులు చచ్చినా ఫర్వాలేదు... తనకు మాత్రం డబ్బులు కావాలనే మనస్తత్వం సీఎం జగన్‌దని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు పోరాటాలు చేస్తున్నా... వైకాపాకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలంటే జగన్‌కు ఎందుకు కోపమని ప్రశ్నించారు.
బంగారు బాతు లాంటి అమరావతిని జగన్ రోజూ... నరుకుతున్నాడని ఆక్షేపించారు. ప్రజల్లో చైతన్యం రాకపోతే... రాజకీయాలు ఎవరి కోసం చేయాలన్నారు. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఆలయాల్లో అన్యమత ప్రచారాలు జరగడం సరికాదని పేర్కొన్నారు. ఒక్కసారి గంగా నదిలో మునిగి... అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.
అమరావతిని నాశనం చేస్తున్నారు