ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం: చంద్రబాబు

ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర దుస్థితికి దర్పణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ పన్నుల పాలనను చాటిచెప్పేలా "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం
ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం

By

Published : Apr 26, 2022, 7:27 PM IST

జగన్ పన్నుల పాలనను చాటిచెప్పేలా "బాదుడే బాదుడు" కార్యక్రమం నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. బాదుడే బాదుడు కార్యక్రమం, సభ్యత్వ నమోదుపై తెదేపా గ్రామ కమిటీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర దుస్థితికి దర్పణమన్నారు. ఇప్పటికే 163 నియోజకవర్గాల్లోని 3 వేలకు పైగా గ్రామాల్లో "బాదుడే బాదుడు" కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

సభ్యత్వ నమోదులో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దాదాపు రూ.100 కోట్ల సాయం అందించామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేశ్ నేతృత్వంతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన... వైకాపా ప్రభుత్వ వైఫల్యమే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details