కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడలో గతనెలలో సంగం డెయిరీ పాలకమండలి సమావేశం నిర్వహించటంపై... సంగం డెయిరీ మేనేజర్ శ్రీధర్‌పై పటమట పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ పోలీసులు గుంటూరులోని శ్రీధర్ స్వగృహానికి వెళ్లగా.. ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మరోసారి గుంటూరు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 9వ తేదీన పటమట పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సంగం డెయిరీ మేనేజర్ శ్రీధర్‌పై పటమట పీఎస్‌లో కేసు నమోదు - Sangam Dairy Latest News
సంగం డెయిరీ మేనేజర్ శ్రీధర్‌పై పటమట పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సంగం డెయిరీ పాలకమండలి సమావేశం నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. ఈనెల 9వ తేదీన పటమట పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
Case registered against Sangam Dairy Manager Sridhar in Patamata PS