దేశంలో బ్యాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: జలీల్‌ఖాన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ మండిపడ్డారు. దేశం అంతా ఈవీఎంలు తీసివేసి బాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నా... ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు.
దేశమంతా ఈవీఎంలు తీసివేసి బ్యాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నా... ఎన్నికల సంఘం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విజయవాడలోని తన కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఈవీఎంల మొరాయింపు, ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు స్లిప్‌ల పంపిణీ, కేంద్రాల వద్ద తాగునీరుతో పాటు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.