ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్న క్యాంటీన్​ మూసేసి.. పేదల కడుపు మాడుస్తున్నారు' - vijya sai reddy

ట్విటర్​ వేదికగా విజయ్​సాయిరెడ్డిపై బుద్దా వెంకన్న మండిపడ్డారు. అన్న క్యాంటీన్​ మూసేసి పేదల కడుపులు మాడుస్తున్న పైశాచిక ఆనందం విజయ్​ సాయిలో కనిపిస్తుందన్నారు.

బుద్దా వెంకన్న

By

Published : Aug 2, 2019, 3:10 PM IST


విజయసాయిరెడ్డికి ఉదయం లేస్తే స్కామ్​, దోపిడీ తప్ప వేరే ధ్యాస లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. అన్న క్యాంటీన్​ మూసేసి పేదల కడుపులు మాడుస్తున్న పైశాచిక ఆనందం విజయ్​ సాయిలో కనిపిస్తుందని మండిపడ్డారు.

అన్న క్యాంటీన్​లో అక్రమాలు జరిగాయన్న వైకాపాపై బుద్దా ద్వజమెత్తారు. నాలుగు రోజుల మత యాత్ర చేస్తున్న వైకాపా అధినేత బందోబస్తుకు 22.52 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు... ప్రతి రోజూ వేలాది మంది పేదలకు వడ్డించే అన్న క్యాంటీన్​ను 35 లక్షలతో కట్టకూడదా అని ప్రశ్నించారు.
దేశం దాటి బయటకు వెళ్తే... ఏ దేశం ఏ జైల్లో తోస్తుందో అని విజయసాయి రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ట్విటర్​ వేదికగా విజయ్​ సాయి రెడ్డిపై బుద్దా వెంకన్న

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details