ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిప్యూటీ ఛైర్మన్​ ఓ జడ్జిలా కాకుండా పార్టీ నేతలా ఉన్నారు: మంత్రి బొత్స - శాసనమండలి జరిగిన తీరు అప్రజాస్వామికం: మంత్రి బొత్స

శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ ఓ జడ్జిలా కాకుండా పార్టీ నాయకుడిగా వ్యవహరించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శాసన మండలి జరిగిన తీరు అప్రజాస్వామికని వ్యాఖ్యనించారు. సంఖ్యా బలముందని ప్రతిపక్ష సభ్యులు వ్యూహాత్మకంగా సభను అడ్డుకున్నారని మండిప్డడారు.

శాసనమండలి జరిగిన తీరు అప్రజాస్వామికం: మంత్రి బొత్స
శాసనమండలి జరిగిన తీరు అప్రజాస్వామికం: మంత్రి బొత్స

By

Published : Jun 18, 2020, 6:47 PM IST

శాసన మండలి జరిగిన తీరు అప్రజాస్వామికమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మండలి డిప్యూటీ ఛైర్మన్, తెదేపా సభ్యుల తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. సంఖ్యా బలముందని ప్రతిపక్ష సభ్యులు వ్యూహాత్మకంగా సభను అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. యనమల వ్యాఖ్యల ఆధారంగానే డిప్యూటీ ఛైర్మన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చారని స్పష్టం చేశారు.

కొన్ని బిల్లుల పట్ల తెదేపా సభ్యులకు అభ్యంతరాలు ఉండటాన్ని తప్పుపట్టటం లేదని...వాటిపై చర్చించాలంటే ముందుగానే నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నిబంధనలేవీ పాటించకుండా ప్రజాతీర్పును కండబలంతో అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. డిప్యూటీ స్పీకర్ ఓ జడ్జిలా కాకుండా పార్టీ నాయకుడిగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్సీ లోకేశ్​ సభలో ఫోటోలు తీసిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించకపోవటం వల్ల ఉద్యోగులకు జీతాలు రెండు రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details